ASBL NSL Infratech

ఘనంగా పుతిన్ ప్రమాణ స్వీకారం.. అయిదోసారి బాధ్యతల స్వీకరణ

ఘనంగా పుతిన్ ప్రమాణ స్వీకారం.. అయిదోసారి బాధ్యతల స్వీకరణ

ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టారు. క్రెమ్లిన్‌లో ఘనంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. దీంతో మరో ఆరేళ్లు (2030 వరకు ) దేశాధినేతగా ఆయన కొనసాగనున్నారు. రష్యా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఎరుపు రంగులో ఉన్న రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పుతిన్‌ దాన్ని పరిరక్షిస్తానన్నారు. దీంతో 24 ఏళ్లుగా రష్యా అధినేతగా కొనసాగుతున్న ఆయన, ఆధునిక రష్యాను అత్యధిక కాలం పాలించిన స్టాలిన్‌ రికార్డును తిరగరాయనున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :