ASBL NSL Infratech

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాధితుడు పీవీ రమేష్.. బండారం బయటపెట్టిన పేర్ని నాని

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాధితుడు పీవీ రమేష్.. బండారం బయటపెట్టిన పేర్ని నాని

ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద వివాదంగా మారింది. ఇప్పటికే దీని చుట్టూ ఎన్నో వివాదాలు నడుస్తున్న సమయంలో తాజాగా ఈ యాక్ట్ కారణంగా తాను బాధితుడుని అయ్యానంటూ ఓ మాజీ ఐఏఎస్ అధికారి చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పీవీ రమేష్ అనే మాజీ ఐఏఎస్ అధికారి.. కృష్ణాజిల్లా విన్నకోట గ్రామానికి చెందిన నేను తండ్రి సుబ్బారావు మాస్టారు పొలం తన పేరుతో రాలేదు అంటూ ఆరోపించారు. దీనిపై తాజాగా స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇలాంటి మాటలు మాట్లాడడం తనకి ఆశ్చర్యాన్ని కలిగించింది అని పేర్కొన్నారు. ఇంతకీ జరిగిన విషయమేమిటంటే.. పీవీ రమేష్ గారి తండ్రి మరికొందరితో కలిసి ఒక 70 ఎకరాల భూమిని కొని అందులో చెరువుని తవ్వి లీజుకు ఇవ్వాలి అనుకున్నారు. అయితే అనుకోకుండా సంవత్సరం క్రితం అతని తండ్రి మరణించారు.

తండ్రి మరణించిన తర్వాత ఆ చెరువు భూమిని మ్యుటేషన్ చేయడానికి రమేష్ ప్రయత్నించారు. కానీ అది చెరువు కోసం సేకరించిన భూమి.. పైగా అందులో కొంత వ్యవసాయ భూమి కూడా ఉంది.. దీంతో రెవెన్యూ అధికారులు బహిరంగంగానే విచారణ నిర్వహించారు. అందరూ ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకువస్తే.. పీవీ రమేష్ మాత్రం అతని దగ్గర పని చేసే వ్యక్తితో జిరాక్స్ కాగితాలు పంపించారు. కానీ అధికారులు ఒరిజినల్ పత్రాలు కావాలి అనడంతో ఆ భూమి విషయం కాస్త వివాదంగా మారింది. అయితే ఇంకా అది పరిష్కారం కూడా కాలేదని పేర్ని నాని తెలియజేశారు..

అసలు జరిగిన విషయం వేరొకటి అయితే.. కావాలని ఇలా ఎవరికోసమో నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాధితుడిని.. అని పీవీ రమేష్ పేర్కొనడం ఎంతవరకు సమంజసం అని నాని ప్రశ్నించారు. అంతేకాదు అక్కడ ఉన్న భూమి విస్తీర్ణం కంటే కూడా అతను ఎక్కువ లీజు తీసుకుంటున్నట్లుగా స్థానిక రైతులే ఆరోపిస్తున్నారని.. దీనికి పీవీ రమేష్ ఏం సమాధానం చెబుతారని పేర్ని నాని ప్రశ్నించారు. ఇది కేవలం జగన్ పై ప్రజలలో వ్యతిరేకత తీసుకురావడానికి.. ప్రభుత్వం పై విషం చిమ్మడానికి చేస్తున్న ఒక దుర్మార్గపు చర్య అని పేర్ని నాని పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :