ASBL NSL Infratech

పార్శీలదే కీలక పాత్ర.. కరోనాపై పోరాటంలో తెరవెనుక యోధులు

పార్శీలదే కీలక పాత్ర.. కరోనాపై పోరాటంలో తెరవెనుక యోధులు

దేశంలో 0.1 శాతం కూడా లేని పార్శీలు కరోనా వైరస్‍పై పోరాటంలో మాత్రం అక్షరాలా అగ్రస్థానంలో ఉన్నట్టు కనిపిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరి నెల మొదలుకుని, ఇప్పటి వరకూ వారు తెర వెనుక పోషిస్తున్న పాత్ర భారతీయులందరూ గర్వపడేలా ఉంది.

కోవిడ్‍ వ్యాక్సిన్‍ కోవిషీల్డ్ ను తయారు చేస్తున్న సీరమ్‍ ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్‍ ఇండియా (పుణే) ఆదార్‍ పూనావాలా అనే ఒక పార్శీ పారిశ్రామికవేత్తది. ఆయన ముంబైలోని పార్శీలకు మొదటగా వ్యాక్సిన్‍ వేయాలంటూ అక్కడికి 60,000 డోసుల వ్యాక్సిన్‍ పంపించారు. అయితే, బాంబే పార్శీ పంచాయత్‍ అధ్యక్షుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన రతన్‍ టాటా కల్పించుకుని, ‘‘మనం మొదట భారతీయులం. ఆ తర్వాతే పార్శీలం. భారతీయులందరితో పాటే మనం కూడా వ్యాక్సిన్‍ వేయించుకోవాలి. మనకు మనం ఏ విధమైన ప్రత్యేకతనూ ఆపాదించుకోకూడదు. ప్రత్యేక సౌకర్యాలేవీ పొందకూడదు” అని తెలిపారు.

పుణేలోని సీరమ్‍ ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్‍ ఇండియా నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాక్సిన్‍ను తరలించడంలో పార్శీలే కీలక పాత్ర నిర్వహించారు. వ్యాక్సిన్‍ను నింపే గ్లాస్‍ వయల్స్ ను స్కాట్స్లైస్‍ అనే కంపెనీలో ఉత్పత్తి చేస్తారు. ఆ కంపెనీ రిషద్‍ దాదాచాంజీ అనే పార్శీ పారిశ్రామికవేత్తది. ఆయన ఈ గ్లాస్‍ వయల్స్ ను ఉచితంగా ఉత్పత్తి చేసి ఇస్తున్నారు. వ్యాక్సిన్‍లనే దేశం నలుమూలలకు తరలించడానికి రతన్‍ టాటా తమ రెఫ్రిజిరేటెడ్‍ వాహనాలను ఆ సంస్థకు ఉచితంగా అందజేశారు. ఆ వాహనాలన్నీ ఆయన కంపెనీలకు చెందినవి.

ఒకవేళ విమానాల ద్వారా రవాణా చేయాల్సి వస్తే తమ విమానాల్లో పంపాలంటూ జే వాడియా అనే మరో పార్శీ ముందుకు వచ్చారు. ముందుకు రావడమే కాదు, వెంటనే అయిదు జెట్‍ విమానాలను సీరమ్‍ ఇన్‍స్టిట్యూట్‍ ఆధీనంలో ఉంచారు. వ్యాక్సిన్‍ను భద్రపరచడానికి డ్రయోక్‍ అనే ద్రవ కార్బన్‍ డయాక్సైడ్‍ను ఉపయోగిస్తారు. ఈ ద్రావకాన్ని ఫారూఖ్‍ దాదాభాయ్‍ అనే మరో పార్శీ సమకూర్చారు.

praneet praneet praneet obili-garuda

దేశంలో 25 కీలక ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్‍ను నిల్వ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఆది గోద్రెజ్‍ అనే ప్రముఖ పారిశ్రామికవేత్త ముందుకు వచ్చి, దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ రెఫ్రిజిరేషన్‍ యూనిట్లను ప్రభుత్వానికి స్వాధీనపరిచారు. దేశంలో ఎప్పుడూ, ఎటువంటి సందర్భంలోనూ తమకంటూ ఏ డిమాండూ చేయని పార్శీలు తమను ఓ అల్పసంఖ్యాక మతస్థులుగా ఏనాడూ పరిగణించుకోరు.

సాధారణ భారతీయులుగానే ప్రజల్లో కలిసిపోతూ, దేశాభివృద్ధికి తమ వంతు సహాయం అందిస్తుంటారు. భారతదేశ జి.డి.పిలో అతి పెద్ద వాటా వారిదే. ఎక్కువగా పన్నులు చెల్లించేది కూడా పార్శీలే. దేశంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు, తమంతట తాముగా ముందుకు వచ్చి దేశాన్ని ఆర్థికంగా ఆదుకునేది కూడా వారే. కరోనాపై పోరాటానికి ప్రభుత్వం విరాళాలు కోరినప్పుడు మూడో కంటికి తెలియకుండా భారీ మొత్తాలలో విరాళాలు అందజేసింది వారే. కరోనాపై దేశం విజయం సాధించడానికి అవసరమైతే తాను తన ఆస్తులు ఇవ్వడానికి కూడా సిద్ధమేనంటూ రతన్‍ టాటా ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

 

Vertex poulomi Png-jewelry
Tags :