ASBL NSL Infratech

స్వ‌యంభు ముందున్న స‌వాళ్లివే

స్వ‌యంభు ముందున్న స‌వాళ్లివే

సినిమా సినిమాకు డిఫ‌రెంట్ క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. కార్తికేయ‌2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం నిఖిల్ స్వ‌యంభు అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. నిఖిల్ కెరీర్లోనే భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ అతివేగంగా జ‌రుగుతుంది. సుమారు రూ.8 కోట్ల బ‌డ్జెట్ తో భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ ను 12 రోజుల పాటు షూట్ చేయ‌బోతున్న‌ట్లు అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు మేక‌ర్స్.

భ‌ర‌త్ కృష్ణ‌మాచారి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాలో సంయుక్త మీన‌న్, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ర‌వి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం నిఖిల్ ఎంతో క‌ష్ట‌ప‌డి యుద్ధ విద్య‌లు, క‌త్తిసాము నేర్చుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా లాంటి సినిమాలు రానున్న 9 నెల‌ల్లో మ‌రో మూడు పాన్ ఇండియా సినిమాలు రానున్నాయి.

అందులో మొద‌టిది క‌ల్కి 2898ఏడి. జూన్ 27న ఈ సినిమా రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ టేకింగ్ గురించి ఇప్ప‌టికే మంచి అంచ‌నాలున్నాయి. రెండోది విశ్వంభ‌ర‌. 2025 జ‌న‌వరిలో రిలీజ్ కానుంది. ఇందులో సూప‌ర్ నేచుర‌ల్ ఎలిమెంట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇక మూడోది కంగువా. జాన‌ర్ ప‌రంగా త‌ప్ప ఈ మూడు సినిమాల‌కూ స్వయంభుకు ఏ సంబంధం లేదు.

వీటిలో క‌ల్కి మాత్ర‌మే స్వ‌యంభు కంటే ముందు వ‌స్తోంది. కాబ‌ట్టి వీలైనంత త్వ‌ర‌గా స్వ‌యంభు టీమ్ అక్టోబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ మ‌ధ్య‌లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందేమో చూసుకోవాలి. కంగువా ఈ ఇయ‌రే అన్నారు కానీ అది వీల‌య్యేలా లేదు. స్వ‌యంభు ముందే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంటే పోలిక‌ల ప‌రంగా ఎలాంటి ప్రాబ్ల‌మ్ ఉండ‌దు. పైగా ఈ సినిమా కోసం స్వ‌యంభు టీమ్ చాలా హోమ్ వ‌ర్క్ చేసింది. ఈ సినిమాతో హిట్ కొడితే నిఖిల్ మార్కెట్ మరింత పెర‌గడం ఖాయం.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :