ASBL NSL Infratech

గ్రీన్‌కార్డుపై నాట్స్ అవగాహన సదస్సు

గ్రీన్‌కార్డుపై నాట్స్ అవగాహన సదస్సు

అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఆన్ లైన్ వేదికగా గ్రీన్‌కార్డ్ పై అవగాహన కల్పించింది. అమెరికాకు వచ్చిన వారు గ్రీన్ కార్డు ఎలా పొందాలి..?  గ్రీన్ కార్డు పొందటానికి నియమ నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బీబీఏ లా గ్రూప్‌కు చెందిన ప్రముఖ అటార్నీ భాను ఇల్లింద్ర అవగాహన కల్పించారు. ఈబీ-5తో గ్రీన్ కార్డు పొందడానికి మనం ఎలాంటి డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి.  ఈ విషయంలో అనుసరించాల్సిన విధానం ఎలా ఉంటుందనే దానిని భాను ఇల్లింద్ర చక్కగా వివరించారు.

డాక్యుమెంటేషన్‌లో చేసే చిన్న చిన్న తప్పులు గ్రీన్‌కార్డు చేతి దాకా వచ్చి చేజారిపోయేలా చేస్తాయని అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇల్లింద్ర హెచ్చరించారు. గ్రీన్‌కార్డు విషయంలో అటార్నీల మద్దతు చాలా కీలకమని అని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రీన్‌కార్డు పొందాలంటే అవగాహనతో పాటు అనుభవజ్ఞులైన లీగల్ అటార్నీల సహకారం అవసరమని సూచించారు. నాట్స్ అమెరికాలో ఉండే తెలుగువారికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని దానిలో భాగంగానే నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి తెలిపారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా అనుదీప్ అర్ల వ్యవహారించారు. అమెరికాకు వచ్చిన తెలుగు వారికి న్యాయపరమైన చిక్కులు లేకుండా గ్రీన్ కార్డుపై అవగాహన కల్పించినందుకు భాను ఇల్లింద్రకు నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :