ASBL NSL Infratech

మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ

మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సాధించారు. 2024 ఏడాదికి ఫోర్బ్స్‌ టాప్‌-10 బిలియనీర్లలో 9వ ర్యాంకును పొందారు. 116 బిలియన్‌ డాలర్ల సంపదతో 66 ఏళ్ల ముకేశ్‌ టా-9గా నిలిచారు. 2023లో ముకేశ్‌ సంపద 83.4 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. కాగా దేశీయంగా సంపదలో టాప్‌-2గా నిలుస్తున్న గౌతమ్‌ అదానీ 84 బిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో 17వ ర్యాంకును అందుకున్నారు. యూఎస్‌ షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణల కారణంగా 2023లో అదానీ సంపద 47.2 బిలియన్‌ డాలర్లకు క్షీణించిన సంగతి తెలిసిందే. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను తోసిపుచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్‌ తిరిగి బలపడింది. ఇక 2022లో అదానీ 90 బిలియన్‌ డాలర్ల నెట్‌వర్త్‌ను సాధించడం ప్రస్తావించదగ్గ అంశం.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :