ASBL NSL Infratech

5 నెలల్లో కరెంటు, నీళ్లు, రైతుబంధు అన్నీ పోయినయ్ : కేసీఆర్

5 నెలల్లో కరెంటు, నీళ్లు, రైతుబంధు అన్నీ పోయినయ్ : కేసీఆర్

5 నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను ఆగమాగం చేసిందంటూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో ఇచ్చిన కరెంటు కాంగ్రెస్ రాగానే పోయిందని, మంచినీళ్లు, రైతుబంధు కూడా ప్రజలకు అందడం లేదని, ఇక రైతుబీమా ఉంటదో పోతదో తెలియని పరిస్థితి నెలకొందని కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నిరుద్యోగులకు 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. యువ వికాసం అని 5 లక్షలు బ్యాంక్‌ కార్డులు ఇస్తామన్నారు. మరి ఏ విద్యార్థికైనా ఇచ్చారా? ఇవన్నీ ఇయ్యకపోతే ఇవ్వకపోయారు. మన గవర్నమెంట్‌ ఉన్నప్పుడు ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా  ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. సోషల్‌ వెల్ఫేర్ హాస్టల్స్‌ 1100 పెట్టడమే కాకుండా వాటిని జూనియర్‌ కాలేజీలుగా మార్చాం. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఆ కాలేజీల్లో పిల్లలకు సరిగ్గా అన్నం కూడా పెట్టడంలేదట. 125 స్కూళ్లలో కలుషిత ఆహారం తిని ఇప్పటికే విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. 5 నెలల్లో ఇంత ఆగమా..?’ అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. అంతేకాకుండా సంక్షేమం కోసం ఖర్చుపెట్టాల్సిన నిధులన్నీ ఎటు పోతున్నాయని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో పరిశ్రమలు, ఐటీ రంగంలో విశేష కృషి చేశామని, బ్రహ్మాండమైన పెట్టుబడులు తెచ్చామని చెప్పిన కేసీఆర్.. నేడు కరెంటు కోతల కారణంగా పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పటికే వెయ్యి కోట్లు చేసే పరిశ్రమ మద్రాసు తరలిపోయిందని, ఇదే రకంగా జరిగితే తెలంగాణ భవిష్యత్తు అంధకారంగా మారిపోతుందని మండిపడ్డారు. నీళ్లు కాపాడుకోవాలన్నా, ఈ కాంగ్రెస్‌ మెడలు వంచి గ్యారంటీలు అమలు చేసేలా చేయాలన్నా బీఆర్‌ఎస్‌ను 12 నుంచి 13 పార్లమెంటు స్థానాల్లో గెలిపించాలని ఓటర్లకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :