ASBL NSL Infratech

బీజేపీ దేశాన్ని సత్యానాశ్ చేసింది: కేసీఆర్

బీజేపీ దేశాన్ని సత్యానాశ్ చేసింది: కేసీఆర్

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర విమర్శలు చేశారు. మోదీ పాలనలో ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ కాలేదని, దేశం సత్యానాశ్ అయ్యిందని ఆరోపించారు. దేశానికి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యే ముందు 150 నినాదాలు చెప్పారని, అందులో ఏ ఒక్కటీ అమలు కాలేదని ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌లో నిర్వహించిన రోడ్డు షోలో ప్రసంగించిన కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘మోదీ మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాలు గాలిలో కలిసిపోయి. ‘బేటీ బచావో- బేటీ పడావో’ నినాదమేమో గాని దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటేలా చేసి బీజేపీ ప్రభుత్వం సామన్యుల నడ్డి విరిచింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నరేంద్ర మోదీ ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షల నగదు జమ చేస్తానన్నారు. మరి చేశారా..?’’ అంటూ బీజేపీపై కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు. అలాగే ‘‘నిజామాబాద్‌లో బీజేపీనే అధికారంలో ఉంది కాబట్టి ఉమ్మడి జిల్లాల్లోని ప్రజలందరి ఖాతాల్లో ఒక్కొక్కరికీ రూ.30 లక్షలు జమయ్యాయట కదా.. నిజమేనా..?’’ అంటూ సెటైర్లు పేల్చారు.

అనంతరం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా మండిపడిన కేసీఆర్.. తెలంగాణ రైతులకు రైతుబంధు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎగనామం పెట్టేందుకు ప్రయత్నించిందని, తాను రంగంలోకి దిగగానే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారన్నారు. ప్రతి ఇంట్లో ఆడబిడ్డలకు రూ.2,500 ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ధోకేబాజీ హామీ ఇచ్చాడన్నారు. రైతులకు రూ.2 లక్షల నగదు ఇచ్చేంతవరకు సీఎం రేవంత్ రెడ్డి మెడలు వంచుతామని ప్రజలకు హామీ ఇచ్చారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :