ASBL NSL Infratech

ఈ అరుదైన రికార్డ్ జగన్ కు దక్కేనా..

ఈ అరుదైన రికార్డ్ జగన్ కు దక్కేనా..

రాజకీయ లో కుటుంబ వారసత్వం మనం చాలా కామన్ గా చూస్తుంటాం. అయితే తండ్రి తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారసులు చాలా అరుదుగా ఉంటారు. ఈ నేపథ్యంలో 2019లో భారీ మెజారిటీతో విజయం సొంతం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి 2024లో కూడా గెలిస్తే..ఒక కొత్త రికార్డుని నెలకొల్పుతారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 2004ఎన్నికలలో గెలిచి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత 2009 లో జరిగిన ఎన్నికలలో ఒంటి చేత్తో పార్టీని సునాయాసంగా గెలిపించి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు జగన్ 2024లో గెలిస్తే వరుసగా రెండుసార్లు సీఎం పదవి చేపట్టిన అతని తండ్రి రికార్డును కూడా సమం చేస్తారు. మరి జగన్ ఈ రికార్డులు తన ఖాతాలో వేసుకుంటారా లేదా అనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :