ASBL NSL Infratech

జగన్ vs చంద్రబాబు.. ఇద్దరిలో ఎవరికి వ్యూస్ ఎక్కువో తెలుసా?

జగన్ vs చంద్రబాబు.. ఇద్దరిలో ఎవరికి వ్యూస్ ఎక్కువో తెలుసా?

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో.. చంద్రబాబుకి, జగన్ కు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. అయితే ఈ ఇద్దరూ ఒకేసారి బుల్లితెరపై తలపడితే ఇద్దరిలో ఎవరికి ఖాతాలో ఎక్కువ వ్యూస్ పడతాయి అన్న విషయం నిన్న తేలిపోయింది. బుధవారం రోజు రాత్రి 8 గంటలకు జగన్ టీవీ9 లో రజనీకాంత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రసారం అవ్వగా.. అదే సమయానికి ఏబీఎన్ లో వేమూరి రాధాకృష్ణతో చంద్రబాబు లైవ్ ఇంటర్వ్యూ నడిచింది. ఏకకాలంలో ఈ రెండు ఇంటర్వ్యూల ప్రసారం ప్రారంభమైంది. విచిత్రం ఏమిటంటే ఎక్కువమంది జగన్ ఇంటర్వ్యూ చూడడానికే ఇష్టపడ్డారు. టీవీ9లో జగన్ ఇంటర్వ్యూ లైవ్ లో అత్యధికంగా 72 వేల  మంది వీక్షించారు.

అదే సమయంలో ఏబీఎన్ లో ప్రసారమైన చంద్రబాబు ఇంటర్వ్యూ కేవలం 20 వేల వ్యూస్ తన ఖాతాలో వేసుకుంది. మరోపక్క సోషల్ మీడియాలో కూడా జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూ కి సంబంధించిన పలు వీడియో క్లిప్స్‌ వైరల్ అవుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రసారమైనట్టు కూడా చాలామందికి తెలియదు. జగన్ మాట్లాడిన ఇంటర్వ్యూలో ఐదు సంవత్సరాలలో తాను ఏమి చేశానో వివరించడంతోపాటు మళ్లీ అధికారంలోకి వస్తే ఏమి చేయబోతున్నాను అనే అంశంపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. తనకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం ని ఎంతో ఓపికగా.. స్పష్టంగా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పారు. దీంతో జగన్ ఏం చెబుతున్నాడో వినాలి అన్న ఆసక్తి ప్రేక్షకులలో బాగా క్రియేట్ అయింది. చంద్రబాబు ఇంటర్వ్యూలో ఆ స్పష్టత కాస్త తగ్గినట్లు కనిపించింది.. అంతేకాదు ఎంతసేపు తన గురించే చెప్పుకోవడమే తప్ప జనానికి ఏం చేస్తాం అన్న విషయంపై ఆయన స్పష్టంగా మాట్లాడలేదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఒక రకంగా చంద్రబాబు ఇంటర్వ్యూకి వ్యూస్ బాగా తగ్గిపోయాయి.

  

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :