ASBL NSL Infratech

2024లో భారత్ వృద్ధి 7.5 శాతం

2024లో భారత్ వృద్ధి 7.5 శాతం

భారత ఆర్థిక వ్యవస్థ 2024లో 7.5 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక అంచనా వేసింది.  గతంలో అంచనా వేసిన వృద్ధి రేటు కంటే 1.2 శాతం పెంచడం విశేషం. భారత్‌లో బలమైన వృద్ధితో పాటు పాకిస్థాన్‌, శ్రీలంకల్లో రికవరీతో దక్షిణాసియాలో వృద్ధి 6 శాతంగా నమోదు కావొచ్చని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. నివేదిక ప్రకారం 2024, 2025లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రాంతంగా దక్షిణాసియా నిలుస్తుందని పేర్కొంది. 2025లో ఈ ప్రాంతంలో 6.1 శాతం వృద్ధిని అంచనా వేసింది. దక్షిణాసియా ప్రాంత ఆర్థిక వ్యవస్థల్లో అధిక వాటా కలిగిన భారత ఉత్పత్తి వృద్ధి 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో 7.5 శాతానికి చేరుతుండటం, సేవలు, పరిశ్రమలు బలంగా ఉండటం కలిసొస్తుందని తెలిపింది. బంగ్లాదేశ్‌ ఉత్పత్తి మాత్రం 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో 5.7 శాతం పెరగొచ్చని వెల్లడిరచింది.  ఇక్కడ అధిక ద్రవ్యోల్బణం, వాణిజ్య ఆంక్షలు, విదేశీ మారకపు నిల్వలు ఆర్థిక కార్యకలాపాలను నిరోధించవచ్చని ప్రపంచ బ్యాంక్‌ వివరించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :