ASBL NSL Infratech

కూటమి పాలిట భస్మాసుర హస్తం.. గాజు గ్లాస్..

కూటమి పాలిట భస్మాసుర హస్తం.. గాజు గ్లాస్..

పవన్ కళ్యాణ్ టీడీపీ కు మద్దతు పలకడం.. బీజేపీ, టీడీపీ తో కలిసి కూటమిగా ఏర్పడడం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో కూటమికి సానుకూలత ఏర్పరుస్తుంది అని అందరూ భావించారు. అయితే ఇప్పుడు అదే గాజు గ్లాసు కూటమి పాలిట భస్మాసుర హస్తంగా మారుతుంది. పనికట్టుకొని ఎవరూ కూటమి గురించి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పని లేకుండా.. గాజు గ్లాసెస్ సృష్టిస్తున్న గందరగోళం కూటమి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. జనసేన పోటీ చేసిన ప్రదేశాలలో ఓకే.. మరి చేయని ప్లేసుల్లో గాజు గ్లాసు కూటమిని చావు దెబ్బ కొట్టడానికి సిద్ధపడుతుంది. ఎలాగంటారా.. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ.. రెండు లోక్సభ స్థానాలలో మాత్రమే జనసేనకు గాజు గ్లాసు గుర్తు వర్తిస్తుంది. మరి ఆ పార్టీ పోటీ చేయని స్థానాలలో ఇండిపెండెంట్ అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తును ఫుల్లుగా వాడేస్తున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాలలో గాజు గ్లాసు గుర్తు పెద్ద డ్యామేజీ చేయబోతుంది అని టాక్. పవన్ కళ్యాణ్ కూటమిలో వ్యక్తి కాబట్టి.. కొంతమంది అభిమానులు కళ్ళు మూసుకొని గాజు గ్లాసుకి గుద్ధారే అనుకోండి.. పాపం కూటమి కుదేల్ అయిపోదు. పోనీ ఉన్న స్థానాలలో ప్రశాంతత ఉందా అంటే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ బకెట్ గుర్తుతో కొంతమంది అభ్యర్థులను బరిలోకి దింపింది. చూడడానికి గాజు గ్లాసు, బకెట్ ఇంచుమించు ఒకే లాగా ఉన్నాయి. కొంతమంది అభ్యర్థులు వీటి రెండిటి మధ్య తేడా తెలియక తికమకపడి పొరపాటున బకెట్ కి ఓటు వేస్తే గాజు గ్లాసు పగిలిపోవాల్సిందే. ప్రస్తుతం ఈ విషయం కూటమి సభ్యుల మనసులో కొత్త అలజడి సృష్టిస్తోంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :