ASBL NSL Infratech

రాజకీయాల్లోకి డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు

రాజకీయాల్లోకి  డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిన్న కుమారుడు బ్యారన్‌ ట్రంప్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. రిపబ్లికన్‌ నేషనల్‌ కన్వెన్షన్‌కు ఫ్లోరిడా నుంచి ప్రతినిధిగా పంపనున్నట్లు పార్టీ చైర్మన్‌ ఇవన్‌ పవర్‌ వెల్లడించారు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున డొనాల్డ్‌ ట్రంప్‌ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఆయన ఎంపికను అధికారికంగా ధ్రువీకరించేందుకు జులైలో పార్టీ కన్వెన్షన్‌ జరగనుంది. దీనికి ఫ్లోరిడా నుంచి 41 మంది ప్రతినిధులు వెళ్లనున్నారు. వారిలో బ్యారన్‌ ట్రంప్‌ ఒకరని పవర్‌ వెల్లడించారు. బ్యారన్‌ ట్రంప్‌ ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటూ వచ్చారు. మార్చిలో ఆయనకు 18 ఏళ్లు వచ్చాయి. వచ్చే వారమే హైస్కూల్‌ నుంచి గ్రాడ్యుయేట్‌ కానున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :