ASBL NSL Infratech

మా మామను నమ్మొద్దు.. సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన అంబటి అల్లుడి వీడియో..

మా మామను నమ్మొద్దు.. సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన అంబటి అల్లుడి వీడియో..

ఆంధ్రాలో ఎన్నికల రచ్చ మామూలుగా లేదు.. కొన్ని దగ్గర్లో కుటుంబ సభ్యులు అంతా అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తుంటే.. మరికొన్ని దగ్గర్ల అభ్యర్థికి వ్యతిరేకంగా కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేత.. ఆంధ్రప్రదేశ్ మంత్రి.. అంబటి రాంబాబు పరిస్థితి కూడా ఇలాగే తయారయ్యింది. సొంత అల్లుడు తన మామకు ఓటు వేయొద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వీడియోని పోస్ట్ చేశాడు. డాక్టర్ గౌతమ్ సోషల్ మీడియా వేదికగా.. తన మామకు ఓటు వేయద్దు అని రిక్వెస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవ్వడంతో సర్వత్రా చర్చనీయాంసంగా మారింది. ఇంతకీ ఆ వీడియోలో అతను ఏం చెప్పారంటే.. ”నమస్కారం.. నా పేరు డాక్టర్ గౌతమ్.. నేను మంత్రి అంబటి రాంబాబు అల్లుడిని అని చెప్పుకోవడం దురదృష్టంగా భావిస్తున్నాను. దానికి ఎవరు ఏం చేయలేరు. ఈ వీడియో చేయాలా వద్దా అని నేను చాలా సార్లు ఆలోచించాను.“ అంటూ తన మామ గురించి అనరాని మాటలు అన్నాడు. పర్సనల్ గా గొడవలు ఉంటే.. పర్సనల్ గా తేల్చుకోవాలి కానీ.. ఎన్నికలను అడ్డుపెట్టుకొని ఇలా ఓపెన్ గా ఒక మనిషి గురించి చెడుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క మా మామ చెడ్డవాడు ఓటు వేయకండి అని ప్రేక్షకులను ఇన్ఫ్లుయన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ.. మరోపక్క దేనికి లొంగకండి బాధ్యతగా ఓటు వేసి మంచి అభ్యర్థిని ఎంచుకోండి అని గౌతమ్ అనడం కాస్త కన్ఫ్యూషన్ కి దారి తీస్తోంది. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి దీనికి అంబటి రాంబాబు ఎటువంటి రిప్లై ఇస్తాడో చూడాలి.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :