ముందుగానే రానున్న దేవర?
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు కానీ అంతర్గతంగా జరుగతున్న చర్చలు కొన్ని కీలక పరిణామాలకు దారి తీసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దేవరను దసరా కంటే రెండు వారాల ముందు రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ముందుగా రిలీజ్ చేస్తే కనీసం మూడు లాంగ్ వీకెండ్స్ దక్కే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొరటాల సినిమాను వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నాడట. ఒకవేళ ముందు రావాలనుకుంటే సెప్టెంబర్ 27 మంచి ఆప్షన్ అవుతుంది. అయితే అదే రోజున పవన్ ఓజీని రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత దానయ్య ఇప్పటికే అనౌన్స్ చేశాడు. కానీ ప్రాక్టికల్ గా ఓజీ చెప్పిన రోజుకు రావడం చాలా కష్టంగా కనిపిస్తోంది.
ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వవ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే పవన్ వెంటనే మేకప్ వేసుకునే పరిస్థితులుండవు. ఈ నేపథ్యంలో ఓజీ చెప్పిన డేట్ ను అందుకోవడం కష్టమే అవుతుంది. సుజిత్ కు పవన్ డేట్స్ కావాల్సింది నెల రోజులే అయినప్పటికీ షూటింగ్ మొత్తం సెట్స్ లో కాదు కాబట్టి అది కష్టమే. ఈ లెక్క దేవర ముందు జాగ్రత్తగా సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో వచ్చేలా ప్లాన్ చేసుకోవడం వల్ల చాలానే లాభాలున్నాయి. నార్త్ లో ఆ టైమ్ కు పెద్దగా పోటీ లేదు. సూర్య కంగువ కూడా అక్టోబర్ లోనే రిలీజ్ కానుంది కాబట్టి ఒకే నెలలో రెండు పాన్ ఇండియా సినిమాల కంటే దేవర ప్రీ పోన్ అవడమే మంచిది.