ASBL NSL Infratech

ప్రపంచ విత్తన ఖజానా సృష్టికర్తలకు.. వరల్డ్ ఫుడ్ ప్రైజ్

ప్రపంచ విత్తన ఖజానా సృష్టికర్తలకు.. వరల్డ్ ఫుడ్ ప్రైజ్

ప్రపంచ వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు విత్తనాలను భద్రపరచాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న కేరీ ఫోలర్‌, జెఫ్రీ హాతిన్‌లకు వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌-2024 లభించింది. వీరు విత్తనాలను భద్రపరిచేందుకు ఆర్కిటిక్‌ సర్కిల్‌లో నార్వేజియన్‌ దీవిలో స్వల్బర్డ్‌ గ్లోబల్‌ సీడ్‌ వాల్ట్‌ను నిర్మించారు.  2008 నుంచి ఇప్పటి వరకు దాదాపు 12.5 లక్షల విత్తనాల శాంపిల్స్‌ను భద్రపరిచారు. వీటిని దాదాపు అన్ని దేశాల నుంచి సేకరించారు. కేరీ ఫోలర్‌ అంతర్జాతీయ ఆహార భద్రతకు సంబంధించిన ప్రత్యేక అమెరికన్‌ దౌత్యవేత్త కాగా, జెఫ్రీ హాతిన్‌ బ్రిటన్‌ వ్యవసాయ శాస్త్రవేత్త, గ్లోబల్‌ క్రాప్‌ డైవర్సిటీలో ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ మెంబర్‌.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :