ASBL NSL Infratech

డ‌బ్బింగ్ మొద‌లెట్టిన పుష్ప‌

డ‌బ్బింగ్ మొద‌లెట్టిన పుష్ప‌

ఈ ఇయ‌ర్ రానున్న పెద్ద సినిమాల్లో పుష్ప‌2 కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌క‌న‌క్క‌ర్లేదు. పుష్ప పార్ట్1 తో పోలిస్తే ఈ సినిమా మీద అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ చాలా లేట‌వుతూ వ‌స్తుంది. ఆగ‌స్ట్ 15న పుష్ప‌2ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. ఈ లోపు సినిమాను రెడీ చేయ‌గ‌లమా లేదా అని చిత్ర వ‌ర్గాలు కంగారు ప‌డుతున్నాయి.

దానికోసం పుష్ప‌2 టీమ్ మొత్తం రాత్రన‌క ప‌గ‌ల‌న‌క తెగ క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ నెల‌లోనే షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి ఆగ‌స్ట్ 15 రిలీజ్ టార్గెట్ ను అందుకోవాల‌ని చూస్తున్నాడు సుకుమార్. అందుకే షూటింగ్ కాస్త లేట‌యినా స‌రే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ విష‌యంలో ఎలాంటి లేట్ జ‌ర‌గ‌కూడ‌ద‌ని షూటింగ్ అయినంత వ‌ర‌కు డ‌బ్బింగ్ ను పూర్తి చేయాల‌ని డిసైడ‌య్యాడ‌ట సుకుమార్.

ఇందులో భాగంగానే పుష్ప‌2 డ‌బ్బింగ్ ను మొద‌లుపెట్టింద‌ట టీమ్. హైద‌రాబాద్ లోని ఓ డ‌బ్బింగ్ స్టూడియోలో బ‌న్నీ త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్ప‌డం మొద‌లుపెట్టాడు. ముందుగా బ‌న్నీ డ‌బ్బింగ్ కంప్లీట్ చేసి ఆ త‌ర్వాత మిగిలిన ఆర్టిస్టుల‌తో చెప్పించ‌నున్నార‌ట‌. అంతేకాదు కొన్ని కీల‌క‌మైన వీఎఫ్ఎక్స్ వ‌ర్క్స్ ను క‌మ‌ల్ క‌ణ్ణన్ టీమ్ ప‌ర్య‌వేక్షిస్తుంద‌ట. ఈ నెలాఖ‌రుకు షూటింగ్ కంప్లీట్ చేసి వ‌చ్చే నెల నుంచి సుకుమార్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ లో నిమ‌గ్నం కానున్నాడు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :