ASBL NSL Infratech

రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల పోలీస్ కంప్లైంట్

రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల పోలీస్ కంప్లైంట్

అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీ కాంగ్రెస్‌ ఐటీ సెల్‌ సిబ్బందిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంలో విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డికి నోటీసలు కూడా పంపించారు. ఈ క్రమంలోనే రేవంత్‌కు మరో షాక్ ఇచ్చింది తెలంగాణ బీజేపీ. మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందంటూ ఇటీవల ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. తమ పార్టీపై రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని, పార్టీ విలువను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కొత్తగూడెం పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే అసత్య ఆరోపణలతో బీజేపీ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరారు.

ఇదిలా ఉంటే లోక్ సభ ఎన్నికల ప్రచారాల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలంతా బీజేపీపై రాజ్యాంగం, రిజర్వేషన్ల విషయంలోనే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో రాజ్యాంగం, రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ ప్రతి వేదికపై ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ప్రచార సభల్లో నేరుగా బీజేపీని టార్గెట్ చేస్తూ.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లను తొలగించేస్తుందని ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు ఇన్నాళ్లూ కౌంటర్ ఇస్తూ వచ్చిన రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే బీజేపీ నేతల ఫిర్యాదైతే పోలీసులు స్వీకరించారు కానీ ఎఫ్‌ఐఆర్ మాత్రం ఇప్పటివరకు నమోదు చేయకపోవడం గమనార్హం.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :