ASBL NSL Infratech

రివ్యూ: 'బీస్ట్' టైమ్ వెస్ట్

రివ్యూ: 'బీస్ట్' టైమ్ వెస్ట్

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2/5

బ్యానర్: సన్ పిక్చర్స్ ఏపీ, తెలంగాణ రిలీజ్: దిల్ రాజు
నటి నటులు: విజయ్, పూజ హెగ్డే, సెల్వ రాఘవన్, యోగి బాబు, రెడీన్ కింగ్స్ లే తదితరులు
మ్యూజిక్: అనిరుద్ సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటర్ : ఆర్ నిర్మల్,
నిర్మాత : కళానిధి మారన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంల నెల్సన్

విడుదల తేదీ: 13.04.2022

తమిళ్ నాడు లో దళపతి విజయ్‌కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. ఆయన సినిమాల్లోని హీరోయిజం, ఆయన్ను చూపించే తీరు, ఇచ్చే ఎలివేషన్స్‌తోనే తమిళంలో సినిమాలు ఆడేస్తుంటాయి. డబ్బింగ్ చిత్రాలతోనే తెలుగులోనూ మార్కెట్ ఏర్పర్చుకున్నాడు విజయ్. ‘నెల్సన్ దిలీప్ కుమార్’ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘బీస్ట్’. ఈ క్రమంలో బీస్ట్ అనే సినిమాను కూడా తెలుగులోకి నేడు ఏప్రిల్ 13 రిలీజ్ చేశారు. మరి బీస్ట్ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ:

వీర రాఘవ (విజయ్) ఒక ‘రా’ ఏజెంట్. ఉమర్ ఫరూక్‌ అనే టెర్రరిస్ట్ నాయకుడిని పట్టుకునే మిషన్‌ ను వీర రాఘవ లీడ్ చేస్తాడు. ఆపరేషన్ కూడా విజయవంతమైంది. కానీ, వీరా చేసిన ఆపరేషన్ లో పొరపాటున ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోతుంది. తన వల్లే ఆ పాప చనిపోయింది అని వీర బాధపడుతూ ‘రా’ నుంచి బయటకు వచ్చేస్తాడు. కొన్ని నెలల తర్వాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం వీరాను చూసి ప్రీతి (పూజ హెగ్డే) ప్రేమలో పడుతుంది. అంతలో చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్ ను ఉగ్రవాదులు ముట్టడి చేసి ఉమర్ ఫరూక్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు. అయితే, కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వీరా కూడా ఆ సమయంలో ఆ మాల్‌ లోనే ఉంటాడు. మరి వీరా ఉగ్రవాదుల నుంచి ప్రజలను ఎలా కాపాడాడు ? వీరాకి ఉగ్రవాదులకు మధ్య వార్ ఎలా జరిగింది ? ఇందులో ప్రీతి పాత్ర ఏంటి? చివరకు ఉమర్ ఫరూక్‌ను ప్రభుత్వం విడిచిపెట్టిందా? వీర రాఘవ ప్రదర్శించిన ధైర్య సాహసాల ఫలితం ఏంటి? చివరకు వీరా వాళ్ళను ఎలా గెలిచాడు ? అనేది మిగిలిన కథ.

నటీనటుల హావభావాలు:

విజయ్ తన గత చిత్రాలు కంటే భిన్నంగా ఉగ్రవాద నేపథ్యంలో ఈసారి యాక్షన్ మైండ్ గేమ్ డ్రామాతో బీస్ట్ గా వచ్చాడు. ఈ సినిమాలో విజయ్ తన లుక్స్ లో అండ్ యాక్షన్ లో ఫ్రెష్ నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. సినిమా అంతా కూడా వన్ మెన్ షోలానే అనిపిస్తుంది. విజయ్ విశ్వరూపం, యాక్షన్ సీక్వెన్స్‌లో రెచ్చిపోవడం, స్టైలీష్ లుక్స్‌తోనే సినిమాను నడిపించేశాడు. విజయ్ మ్యానరిజం, స్టైల్ అన్నీ కూడా అభిమానులను మెప్పిస్తాయి. మాస్‌కు ఈ కారెక్టరైజేషన్ ఇట్టే ఎక్కేస్తుంది. ఇక ఈ చిత్రంలో సెల్వ రాఘవన్ కొన్ని చోట్ల తన సెటైరికల్ డైలాగ్స్‌తో నవ్వులు పూయిస్తాడు. ఇక పూజా హెగ్డే, యోగిబాబు, కమెడియన్ పృథ్వీ వంటి వారంతా కూడా తమ పరిధి మేరకు మెప్పించారు. మిగతా తమిళ నటులు కూడా కామెడీ పండించారు.

సాంకేతికవర్గం పనితీరు:

బీస్ట్ సినిమా సాంకేతిక పరంగా ఉన్నతంగానే ఉంది. విజువల్స్, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని చక్కగా కుదిరాయి. దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ పాయింట్,కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి క‌మ‌ర్షియ‌ల్ అంశాలకి సామాజిక అంశాలు కలిపి ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు. అయినప్పటికీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాను చూసిన ఫీలింగే వస్తుంది. అయితే దర్శకుడు తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. సినిమాలో చాల చోట్ల లాజిక్స్ మిస్ కాకుండా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఇక సంగీతం విషయానికి వస్తే.. పాట‌లు ఫర్వాలేదనిపిస్తే, నేప‌థ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్ర‌ఫర్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా ఎఫెక్టివ్ గా గ్రాండ్ గా ఉండడమే ప్లస్.

విశ్లేషణ:

బీస్ట్ సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద కథేమీ ఉండదు. అలాగని ఉత్కంఠ రేపే ట్విస్ట్‌లేమీ ఉండవు. సినిమా అంతా కూడా మాల్ చుట్టే తిరుగుతుంది. ఉమర్ ఫరూక్‌ను విడిపించేందుకు తీవ్రవాదులు హైజాక్ చేయడం, దాన్ని అడ్డుకునేందుకు వీర రాఘవ ఎంతకైనా తెగించడం చుట్టే తిరుగుతుంది. ఒకే పాయింట్ చుట్టూ కథను రెండున్నర గంటలకు పైగా తిప్పడం మామూలు విషయం కాదు. నెక్ట్స్ ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠను ప్రేక్షకుల్లో కలిగించకపోవడంతో బీస్ట్ సాధారణ చిత్రంగానే మిగిలిపోయింది. హై మూమెంట్స్ కూడా సినిమాలో పెద్దగా ఏమీ అనిపించదు. ఇలాంటి మాస్ కమర్షియల్ యాక్షన్ చిత్రాలకు ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ సీన్స్ అనేవి స్పెషల్‌గా డిజైన్ చేసుకుంటారు. కానీ ఇక బీస్ట్ విషయానికి వస్తే.. అలాంటిదేమీ అనిపించదు. విజయ్ యాక్షన్ సీక్వెన్స్, నెల్సన్ స్టైలీష్ మేకింగ్ తప్పా ఇందులో ఏమీ లేదు. పైగా "ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను" అనే డైలాగ్‌ను ఇంటర్వెల్, క్లైమాక్స్‌ లో వాడేస్తారు. అది మన తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం కొత్తగా అనిపించదు. పైగా నవ్వు తెప్పించేలా ఉంది. ఈ సినిమా ఎవరిని ఏ మాత్రం ఆకట్టుకోదు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :