ASBL NSL Infratech

ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు

ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు

ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్‌ (ద టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఏ ఫారెన్‌ లాంగ్వేజ్‌) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్‌) ప్రకటించింది. గతేడాది జులైలో ఆస్ట్రేలియా హోం వ్యవహారాల విభాగం (డీహెచ్‌ఏ) టోఫెల్‌పై సమీక్షించి, ఇకపై ఈ స్కోర్లను ఆమోదించబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో టోఫెల్‌ను నిర్వహించే, ప్రిన్స్‌టన్‌ కేంద్రంగా పని చేసే ఈటీఎస్‌ సంస్థ స్పందించింది. మే 5, 2023 నుంచి నిర్వహించే పరీక్షల్లో సాధించిన స్కోరును ఆస్ట్రేలియా వీసా అవసరాల నిమిత్తం పరిగణనలోకి తీసుకుంటారంది. డీహెచ్‌ఏ గతేడాది చేపట్టిన సమీక్ష ప్రక్రియను అనుసరించి టోఫెల్‌ ఐబీటీలో మార్పులు చేశాం. అనంతరం మార్పులకు ఆమోదం లభించింది అని ఈటీఎస్‌ ఇండియా, దక్షిణాసియా మేనేజర్‌ సచిన్‌జైన్‌ తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :