ASBL NSL Infratech

విదేశీ విద్యార్థులపై ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!

విదేశీ విద్యార్థులపై ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!

వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులపై కీలక నిర్ణయం తీసుకుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థుల కనీస బ్యాంకు బ్యాలెన్సు మొత్తాన్ని 29,710 ఆస్ట్రేలియన్‌ డాలర్లకు పెంచుతున్నట్లు  ప్రకటించింది. గత ఏడు నెలల్లో విద్యార్థుల బ్యాంకు బ్యాలెన్సు ఇలా పెంచడం రెండోసారి. ఆంథోనీ ఆల్బనీస్‌ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భారత విద్యార్థులపై భారం పడనుంది. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులు అక్కడ ఏడాది నివాసానికి అయ్యే ఖర్చుల మొత్తాన్ని తమ ఖాతాలో ఉన్నట్లు చూపెట్టాల్సి ఉంటుంది. ఈ వీసా డిపాజిట్‌ కనీస పరిమితి గతంలో 21,041 ఆస్ట్రేలియన్‌ డాలర్లుగా ఉండేది. గతేడాది అక్టోబర్‌లో దాన్ని 24,505 డాలర్లకు పెంచగా, తాజాగా 29,710 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది 19,576 అమెరికన్‌ డాలర్లతో సమానం.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :