ASBL NSL Infratech

త‌న సినిమాకు అసిస్టెంట్‌తో డైరెక్ట్ చేయించిన సుకుమార్

త‌న సినిమాకు అసిస్టెంట్‌తో డైరెక్ట్ చేయించిన సుకుమార్

ఏదైనా సినిమాకు డైరెక్ట‌ర్ గా పేరు వేసుకున్న‌ప్పుడు ఆ సినిమాను తానే తీయాల్సి ఉంటుంది. కానీ తాను తీసిన రెండు సినిమాల్లో కీల‌క‌మైన సీన్స్ ను త‌న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ తో చేయించిన‌ట్లు సుకుమార్ రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూ లో చెప్పాడు. ఆ రెండు సినిమాలు మ‌రేవో కాదు. అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన ఆర్య‌2, ఎన్టీఆర్ హీరోగా న‌టించిన నాన్న‌కు ప్రేమ‌తో.

ఆ రెండు సినిమాల్లోని రెండు కీల‌క సీన్స్ ను అప్ప‌టి త‌న అసిస్టెంట్ అయిన అర్జున్ డైరెక్ట్ చేసిన‌ట్లు సుక్కు పేర్కొన్నాడు. రీసెంట్ గా రిలీజైన ప్ర‌స‌న్న వ‌ద‌నం సినిమాతో డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మ‌య్యాడు అర్జున్. ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకుంటూ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌ర్వాలేద‌నిపిస్తోంది. ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అర్జున్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన సుక్కూ, అత‌ను త‌న నుంచి దూర‌మ‌య్యాక లాజిక్ ఉన్న సినిమాలు చేయ‌డం మానేశాన‌ని చెప్పిన విష‌యం తెలిసిందే.

ఇక తాజాగా ప్ర‌స‌న్న‌వ‌ద‌నం ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చేసిన ఇంట‌ర్వ్యూలో సుకుమార్ మ‌రోసారి త‌న అసిస్టెంట్ మీదున్న ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టాడు. త‌న అసిస్టెంట్ ను తాను న‌మ్మి ఆ బాధ్య‌త ఇవ్వ‌డం గొప్పేమీ కాద‌ని, ఎన్టీఆర్, బ‌న్నీ.. అర్జున్ ను న‌మ్మి ఆ సీన్స్ చేయ‌డం వాళ్ల గొప్ప‌త‌న‌మ‌ని తెలిపాడు. ఏదేమైనా త‌న శిష్యుల‌కు సుకుమార్ ఇచ్చే ఎలివేష‌న్లు నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయిలే.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :