ASBL NSL Infratech

ఆయ‌న చెప్తే ఎలాంటి పాత్రైనా చేస్తా: అర్జున్ దాస్

ఆయ‌న చెప్తే ఎలాంటి పాత్రైనా చేస్తా: అర్జున్ దాస్

ఈ మ‌ధ్య సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో అర్జున్ దాస్ పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంది. చేసింది కొన్ని సినిమాలే అయినా త‌ను చేసిన ప్ర‌తి పాత్ర ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. ప్ర‌స్తుతం హీరోగా ర‌స‌వాది అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు అర్జున్. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అర్జున్ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

దుబాయ్ లో ప‌నిచేసే తాను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చెన్నైలో సెటిలైన‌ట్లు చెప్పాడు. ఖైదీ సినిమాలో లోకేష్ ఛాన్స్ ఇచ్చినప్పుడు అది త‌న కెరీర్ ను మార్చేస్తుంద‌ని అస్స‌లు అనుకోలేద‌ని అర్జున్ చెప్పుకొచ్చాడు. ఖైదీ, మాస్ట‌ర్ సినిమాల్లోని పాత్ర‌లు త‌న‌కు గుర్తింపును తీసుకురాగా, ఇప్పుడు కూడా చాలా మంది అలాంటి పాత్ర‌లతోనే త‌న‌ను సంప్ర‌దిస్తున్న‌ట్లు చెప్పాడు అర్జున్ దాస్.

కానీ త‌ను మాత్రం అలాంటి పాత్ర‌లు చేయాల‌నుకోవ‌డం లేద‌ని, ఒక‌వేళ లోకేష్ మ‌ళ్లీ అలాంటి పాత్ర‌ను ఆఫ‌ర్ చేస్తే మాత్రం క‌చ్ఛితంగా ఓకే చెప్తాన‌ని చెప్పిన అర్జున్, లోకేష్ చెప్తే ఎలాంటి సినిమానైనా, ఎలాంటి పాత్ర‌నైనా చేయ‌డానికి రెడీగా ఉన్నాన‌ని, హీరోగా ఎంత స‌క్సెస్ అయినా త‌ను అడిగితే విల‌న్ గా న‌టించడానికైనా సిద్ధ‌మ‌ని అర్జున్ త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టాడు. మ‌రి హీరోగా అర్జున్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు త‌న‌కెలాంటి ఫ‌లితాన్నిస్తాయో చూడాలి.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :