ASBL NSL Infratech

జపాన్‍ లో మరో కొత్త వైరస్‍

జపాన్‍ లో మరో కొత్త వైరస్‍

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త రూపు దాల్చింది. అయితే జపాన్‍ లో మాత్రం ఫోర్త్ వేవ్‍ తో విజృంభిస్తోంది. మరో మూడున్నర నెలల్లో ఒలింపిక్స్ మొదలుకానున్న సమయంలో ఫోర్త్ వేవ్‍ ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వైరస్‍ వేరియంట్లు ప్రజలను భయపడుతున్నాయి. ప్రస్తుతం జపాన్‍లో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాటు ఎప్పటికప్పుడు కొత్త మ్యుటేషన్లు బయటపడుతున్నాయి. తాజాగా జపాన్‍లోని ఈక్‍ మ్యుటేషన్‍ బయటపడింది. టోక్యో నగరంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈక్‍  మ్యుటేషన్‍ విస్తరిస్తోంది. అయితే టోక్యోలో వస్తున్న కరోనా కేసుల్లో 70 శాతం కేసుల్లో ఈక్‍ వేరియంట్‍ నిర్ధారణ అయినట్లు •పాన్‍ అధికారులు తెలిపారు. ఒసాకా నగరంలో ఈ వేరియంట్‍ అత్యంత వేగంగా వ్యాపిస్తోందంటున్నారు నిపుణులు. ప్రజలు అలర్ట్ గా ఉండి కరోనా రూల్‍ పాటించాలని సూచిస్తున్నారు. మాస్క్ తో పాటు భౌతిక దూరం తప్పని సరి అని అంటున్నారు.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :