ASBL NSL Infratech

దుబాయ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం!

దుబాయ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం!

ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అభివృద్ది దశలో ఉన్న దుబాయ్‌ వరల్డ్‌ సెంట్రల్‌లోని అల్‌ మక్తూమ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో 35 బిలియన్‌ డాలర్ల (రూ.2.9 లక్షల కోట్లు)తో కొత్త టెర్నినల్‌ నిర్మించనున్నారు. వచ్చే ఐదేళ్లలో కార్యకలాపాలన్నీ అక్కడ నుంచే సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు దుబాయ్‌ పాలకుడు ప్రకటించారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద టెర్నినల్‌గా నిలవనుంది. కొత్తగా నిర్మించనున్న టెర్నినల్‌ను అల్‌ మక్తూవ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుగా పిలుస్తారు. దుబాయ్‌లో త్వరలో ప్రపంచ ఎయిర్‌ పోర్టు, పోర్టు, అర్బన్‌ హబ్‌, న్యూ గ్లోబల్‌ సెంటర్‌ అందుబాటులోకి రానున్నాయని దుబాయ్‌ పాలకుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ పేర్కొన్నారు.  తదుపరి కార్యకలాపాలు అక్కడనుంచే సాగుతాయని, భవిష్యత్తు తరాల కోసం ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :