ASBL NSL Infratech

ప్రపంచంలోనే పిన్న బిలియనీర్ గా లివియా

ప్రపంచంలోనే పిన్న బిలియనీర్ గా లివియా

ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులోనే ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించింది. 19 ఏళ్ల కాలేజీ అమ్మాయి లివియా వొయిట్‌ చరిత్ర సృష్టించింది. 20 ఏళ్లు కూడా నిండని ఈమెకు అత్యంత సంపన్నుడైన తాతా నుంచి వారసత్వంగా కోట్ల షేర్లు దక్కడంతో ఒక్కసారిగా వేల కోట్ల అధిపతి అయ్యింది. బ్రెజిల్‌కు చెందిన డబ్ల్యూఈజీ కంపెనీని లివియో తాతా వెర్నెల్‌ రికార్డో వొయిట్‌ మరో ఇద్దరితో కలిసి స్థాపించారు. ఫోర్బ్స్‌ సంస్థ 33 ఏళ్ల వయసులోపు ఉన్న 25 మంది యువ బిలియనీర్ల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇందులో లివియా పేరు కూడా ఉంది. దాదాపు రూ.9,165 కోట్ల ( 1.1 బిలియర్‌ డాలర్ల) సంపదతో ప్రపంచంలో బిలియనీర్‌ అయిన అత్యంత చిన్న వయస్కురాలుగా ఈమె పేరు రికార్డులకెక్కింది. కోట్లకు పడగలెత్తినా ఇంకా ఆమె కంపెనీ బోర్డులో సభ్యురాలిగా చేరలేదు. ఆస్తులతో నాకేం పని అన్నట్లుగా నిరాడడంబరంగా లివియో ప్రస్తుతం బ్రెజిల్‌ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :