ASBL NSL Infratech

ఏపీలో కొత్తగా 1,288 కేసులు

ఏపీలో కొత్తగా 1,288 కేసులు

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో కరోనా బారినపడుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 31,116  పరీక్షలు నిర్వహించగా 1,288 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,04,548 మంది వైరస్‍ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 610 బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,88,508కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,815 యాక్టివ్‍ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,51,46,104 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‍ వల్ల అనంతపురం, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,225కి చేరింది. అత్యధికంగా గుంటూరులో 311, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1,288 మొత్తం కొవిడ్‍ కేసుల్లో 1009 (78 శాతం) కేసులు కేవలం ఐదు జిల్లాల్లోనే నమోదు కావడం గమనార్హం.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :