ASBL NSL Infratech

'హౌస్ పుల్ 4'లో రానా కీలక పాత్ర

'హౌస్ పుల్  4'లో రానా కీలక పాత్ర

బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌, రితేష్‌దేశ్‌ముఖ్‌, బాబీ డియోల్‌ ప్రధాన తారాగణంగా తెరెక్కుతోన్న చిత్రం హౌస్‌పుల్‌ 4. గత ఏడాది మీటూ ఉద్యమం ఊపందుకున్న తరుణంలో ఈ చిత్ర దర్శకుడు సాజిద్‌ ఖాన్‌పై పలు వేధింపు ఆరోపణలు వచ్చాయి. పలువురు నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. దాంతో చిత్ర నిర్మాణాన్ని కొద్ది కాలం ఆపేసి దర్శకుడు ఆ చిత్రం నుంచి తొలగించారు. కాగా, ప్రస్తుత ఈ చిత్రానికి ఫర్హాద్‌ సామ్జీ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యలో ఈ చిత్ర బాధ్యతలు తీసుకోవడం సవాల్‌గా మారిందని పేర్కొన్నారు. ఇందులో రానా దగ్గుబాటి పాత్ర చాలా కీలకమైందని పేర్కొన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :