ASBL NSL Infratech

'న్యూజెర్సీ నాట్స్ క్యాన్ ఫుడ్ డ్రైవ్' & 'నాట్స్ వెల్నెస్ డ్రైవ్ ఫర్ హోంలెస్' కు విశేష స్పందన

'న్యూజెర్సీ నాట్స్ క్యాన్ ఫుడ్ డ్రైవ్' & 'నాట్స్ వెల్నెస్ డ్రైవ్ ఫర్ హోంలెస్' కు విశేష స్పందన

అన్నార్తులను ఆదుకోవడానికి ఎప్పటి లానే ముందుకొచ్చిన నాట్స్

ఉన్నవారికి ఆ ఆకలి తీర్చడమే అత్యుత్తమ సేవగా భావించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికా వ్యాప్తంగా ఒన్ మిలియన్ ఫుడ్ డ్రైవ్ అంటూ 2016 లో ప్రారంభించి అమెరికా వ్యాప్తంగా నాట్స్ ఇచ్చిన పిలుపుకు అమెరికాలో నాట్స్ విభాగాలన్నీ స్పందిస్తున్నాయి. తాజాగా న్యూజెర్సీ లో నాట్స్ ఒన్ మిలియన్ ఫుడ్ డ్రైవ్ కు విశేష స్పందన లభించింది. నాట్స్ సభ్యులతో పాటు స్థానికంగా ఉండే తెలుగువారంతా పేదలకు అందించే ఫుడ్ క్యాన్స్ సేకరించడంలో మేముసైతం అంటూ పోటీపడ్డారు.

నాట్స్ మాజీ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి నాట్స్ నాయకగణం శ్రీహరి మందాడి, రమేష్ నూతలపాటి, వంశీ కృష్ణ వెనిగళ్ల, అరుణ గంటి, శ్యాం నాళం, రంజిత్ చాగంటి, మురళీ కృష్ణ మేడిచెర్ల, విష్ణు ఆలూరు, చంద్రశేఖర్ కొణిదెల, మోహన్ కుమార్ వెనిగళ్ళ, సురేష్ బొల్లు, శ్రీనివాస్ వెంకట, శేషగిరి కంభంమెట్టు, సుధాకర్ తురగ, శ్రీనివాస్ గోగినేని ఒన్ మిలియన్ క్యాన్ ఫుడ్ డ్రైవ్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

భాషే రమ్యం.. సేవే గమ్యం అన్న నినాదాన్ని చేతల్లో రుజువు చేస్తూ నాట్స్ ప్రతి యేటా భారీ ఎత్తున ఈ ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. న్యూజెర్సీతో పాటు అమెరికాలోని పలు నగరాల్లో ఈ ఫుడ్ డ్రైవ్ జరగనుంది. ఫుడ్ డ్రైవ్ ద్వారా సేకరించిన ఫుడ్ క్యాన్స్ ను స్థానిక ఓజామన్ కేథలిక్ ఛారిటీకి నాట్స్ డోనేట్ చేసింది. పేదపిల్లల కడుపులు నింపేందుకు ఈ ఛారిటీ సంస్థ పనిచేస్తుంది. నాట్స్ ప్రతి చాప్టర్ లోనూ ఈ ఫుడ్ డ్రైవ్ నిర్వహించి పేదపిల్లల ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తోంది. నాట్స్ పిలుపుకు స్పందించి తమ వంతుగా ఫుడ్ క్యాన్స్ అందించిన ప్రతి ఒక్కరిని నాట్స్ ధన్యవాదాలు తెలుపుతోంది.

ఈ సందర్భం గా నాట్స్ ప్రవేశ పెట్టిన మరో కార్యక్రమం నాట్స్ వెల్నెస్ డ్రైవ్ ఫర్ హోంలెస్ గురించి మోహన్ మన్నవ, వంశీ వెనిగళ్ల, శ్రీహరి మందాడి, రమేష్ నూతలపాటి తదితరులు వివరించారు.

ఈ కార్యక్రమం ద్వారా, దైనందిక జీవనానికి ఉపయోగపడే టూత్ బ్రష్లు, పేస్ట్లు, నాప్కిన్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ తదితర నిత్యావసర వస్తువులు కూడా పిల్లలు ఈ ఓజోమన్ కాథలిక్ ఛారిటీ సంస్థకు అందించారు. మోహన్ కుమార్ వెనిగళ్ళ మాట్లాడుతూ.. నాట్స్ ఫామిలీ లో ఒకరైన సౌమిక గూడూరు ఆలోచన ను నాట్స్ సేవా కార్యక్రమాలలో ఒకటిగా చేసి చిన్న పిల్లల ద్వారా ఈ కార్యక్రమాన్ని యువతలో చైతన్యం తెచ్చి వారిని కూడా సేవా కార్యక్రమాల వైపు నడిపించేందుకు నాట్స్ నాయకత్వం నడుం బిగించి ముందుకు నడిపిస్తోంది.

Click here for Event Gallery

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :