ASBL NSL Infratech

సీఎం జగన్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే

సీఎం జగన్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే

నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశానని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మద్దాలి గిరి తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమస్యలతో పాటు సీఎఫ్‌ఎంఎస్‌ బకాయిల అంశాన్ని జగన్‌ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. సీఎం వెంటనే స్పందించి రూ.25 కోట్ల సీఎఫ్‌ఎంఎస్‌ బకాయిలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. వైకాపా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆదర్శగా మారాయని అన్నారు. దివంగత రాజశేఖర్‌ రెడ్డి హయాంలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరిగిందని, అలాంటి విప్లవం ప్రస్తుతం జగన్‌ పాలనలో వస్తుందనే నమ్మకం ఉందన్నారు. తమ పిల్లలకు ఆంగ్లం నేర్పాలనే ఆలోచనతో పేద ప్రజలు ఉన్నారని ఈ అంశంపై చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆయన విమర్శించారు.

రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టే ఆర్థిక పరిస్థితి ప్రభుత్వానికి లేదన్నారు. రాజధాని అంశంలో ముఖ్యమంత్రి జగన్‌కు సృష్టమైన ఆలోచన ఉందని అన్నారు. శాసన రాజధానిగా అమరాతి కొనసాగుతుందని ముఖ్యమంత్రి సృష్టం చేశారన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :