ASBL NSL Infratech

ఈపీఎఫ్ ఓ ఖాతాదారులకు శుభవార్త

ఈపీఎఫ్ ఓ ఖాతాదారులకు శుభవార్త

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఖాతాదారులకు శుభవార్త. ఈపీఎఫ్‌కు వడ్డీ రేటును పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటును 8.55 శాతం నుంచి పెంచాలని భావిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించినట్లు ఓ మీడియా నివేదికలో వెల్లడించారు. అయితే వార్షిక అంతర్గత సమీక్షా సమావేశంలో ఈపీఎఫ్‌ఓ వడ్డీరేటు పెంపుపై నిర్ణయం తీసుకోనుందని తెలిపింది. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేటు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్‌ఓ వడ్డీ రేటు పెంచితే దాదాపు 6 కోట్ల మంది ఖాతాదారులకు లాభం చేకూరనుంది.

2019లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉద్యోగులకు లాభం చేకూర్చేందుకు వడ్డీ రేటు పెంచే అవకాశం ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. వడ్డీ రేటు పెంపు గురించి ఈ నెలాఖరుకి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా డిసెంబరు నెలాఖరులోగా వడ్డీరేటుపై నిర్ణయం తీసుకుంటారని, కానీ ఈసారి అకౌంట్‌ ఆడిట్లు పూర్తి కాకపోవడం వల్ల ఆలస్యమైందని సంబంధిత అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న వడ్డీరేటు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :