ASBL NSL Infratech

అలాచేస్తే భారతీయులకే ఎక్కువ గ్రీన్ కార్డులు

అలాచేస్తే భారతీయులకే ఎక్కువ గ్రీన్ కార్డులు

అమెరికాలో గ్రీన్‌ కార్డు జారీలో తీవ్ర జాప్యం జరుగుతోందని, కోటా నిబంధనను ఎత్తివేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే దేశాల కోటా నిబంధనను తొలగించడం వల్ల భారత్‌, చైనా దేశాల వారికే ఎక్కువ గ్రీన్‌కార్డులు వస్తాయి. అమెరికా పౌరసత్వం పొందేవారిలోనూ ఈ దేశాలకు ఆధిపత్యం ఉంటుందని తాజానివేదిక వెల్లడించింది. అయితే నేటి (3వ తేదీ) నుంచి అమెరికా కాంగ్రెస్‌ ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లో గ్రీన్‌కార్డుల జారీల్లో దేశాల కోటాను ఎత్తివేసేలా చట్టాన్ని తీసుకురావాలని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఈ కోటాను ఎత్తివేయడం వల్ల అమెరికా మార్కెట్లో ప్రస్తుతం దేశాల మధ్య ఉన్న వివక్ష తొలగిపోతుందని, దీంతో భారత్‌, చైనా లాంటి దేశాలకు ఆధిపత్యం చెలాయించే అవకాశం వస్తుందని కాంగ్రేషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ (సీఆర్‌ఎస్‌) ఓ నివేదికలో వెల్లడించింది.

ప్రస్తుతం దేశాల కోటా వల్ల చాలామంది భారతీయులు గ్రీన్‌కార్డు కోసం తొమ్మిదిన్నర ఏళ్లు ఎదురుచూడాల్సి వస్తోంది. కోటాను ఎత్తివేస్తే ఎదురుచూసే భారతీయుల సంఖ్యగా భారీగా తగ్గుతుందని సీఆర్‌ఎస్‌ తెలిపింది. దీంతో పెండింగ్‌ దరఖాస్తులు కూడా తగ్గుతాయని పేర్కొంది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :