జో బైడెన్ 306… డొనాల్డ్ ట్రంప్ 232
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాల ఫలితాలు కూడా వచ్చాయి. జార్జియాలో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, నార్త్ కరోలినాలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. అలస్కాలో విజయంతో ఇప్పటికే ట్రంప్ 217 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా నార్త్ కరోలినాలో గెలపుతో తన ఎలక్టోరల్ ఓట్ల సంఖ్యను 232కి పెంచుకున్నారు. ఇప్పటికే మేజిక్ మార్క్ 270ని సునాయాసంగా దాటేసిన బైడెన్.. తాజాగా జార్జియాలో గెలుపుతో 306 ఎలక్టోరల్ ఓట్లతో వైట్హౌజ్లోకి వెళ్లనున్నారు. జార్జియాలో బైడెన్, నార్త్ కరోలినాలో ట్రంప్ గెలుపొందారని అమెరికాలో ప్రధాన మీడియా సంస్థలు పేర్కొన్నాయి. జార్జియాలో గెలుపుతో బైడెన్ మరో రికార్డు సాధించారు. గత 287 ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన జార్జియాను డెమొక్రటిక్ పార్టీ ఖాతాలో వేశారు. గత 28 ఏళ్లుగా అక్కడ డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి గెలుపొందలేదు.






