అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో వివేక్ రామస్వామి… ఇతర అభ్యర్థుల కంటే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ప్రముఖ భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆయన గతవారం ఏకంగా 42 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వచ్చే వారం కూడా 38 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్న ఇతర అభ్యర్థుల కంటే ప్రచార పర్వంలో ఆయన చాలా ముందున్నారు. నా ప్రచార కార్యక్రమాలకు హాజరవుతున్న ప్రజలను చూస్తుంటే ఎంతో శక్తి లభిస్తోంది. దేశం పట్ట వారికి ఉన్న శ్రద్దే నన్ను ప్రోత్సహిస్తోంది. సామాజిక మాధ్యమాలు, టెలివిజన్ ప్రసారాలతో కూడా ఈ స్థాయి ప్రచారం అసాధ్యం. విరాళాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం అంటే పిజ్జా అవుట్లెట్లలో ప్రజలతో సంభాషించడం మేలని భావిస్తున్నా. మనం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలతో మమేకం కావడానికి ఇదే సరైన మార్గం. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నా ఎన్నికపై పూర్తి విశ్వాసం ఉంది అని వివేక్ తెలిపారు.






