భారత్ కు అమెరికా వార్నింగ్
రష్యా నుంచి భారత్ వంటనూనెల దిగుమతులపై అమెరికా ఆగ్రహంతో ఉన్నది. రష్యా నుంచి భారత్ ఆయిల్ దిగుమతులు పెంచొద్దని హెచ్చరించింది. ఒక పక్క రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మరోపక్క భారత్లో రష్యా విదేశాంగ మంత్రి సెర్జే లావ్రోవ్ భారత్కు చేరుకున్న నేపథ్యంలో అమెరికా ఈ హెచ్చరికలు పంపడం గమనార్హం. రష్యా నుంచి వంటనూనెల దిగుమతులు భారత్కు పెద్ద ప్రమాదానికి (గ్రేట్స్ రిస్క్) గురి చేస్తుందని వాషింగ్టన్ వార్నింగ్ పంపింది. అయితే ఈ ప్రమాదం గురించి స్పష్టత లేనప్పటికీ రష్యా నుంచి వంటనూనెల కొనుగోలుపై అమెరికా ఆంక్షలు విధించొచ్చని తెలుస్తున్నది.






