Chandrababu: ఏ చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదు : సీఎం చంద్రబాబు
సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా సహించేది ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. సచివాలయం (Secretariat)లో సీఎం సంక్షేమ, వసతి గృహాలు, గురుకులాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయంపై అధికారులతో సమీక్షించారు. ఏం జరిగిందో తెలుసుకునేది ఉండదని, నేరుగా బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. వసతి గృహాలు, గురుకులాల్లో 100 శాతం పారిశుద్ధ్య నిర్వహణ ఉండాలన్నారు. ప్రతి వసతిగృహంలో ఆర్వో ప్లాంటును అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. అన్నిచోట్లా నీటి నమూనాలు తీసుకుని పరీక్షించాలన్నారు. ఎస్సీ (SC) , ఎస్టీ (ST) , బీసీ (BC) వసతి గృహాల్లో తనిఖీలను మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు మొదలుకుని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు తమ విధినిర్వహణలో భాగంగా చేసుకోవాలని సూచించారు.






