J.D. Vance :ఉషకు తోడుగా గ్రీన్‌లాండ్ పర్యటనకు జేడీ వాన్స్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) కీలక ప్రకటన చేశారు. తన సతీమణి ఉషా వాన్స్ (Usha Vance )తో కలిసి గ్రీన్‌లాండ్ (Greenland) పర్యటనకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ భద్రత ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గ్రీన్‌లాండ్ ప్రజల భద్రతను పునరుజ్జీవింపజేయాలనుకుంటున్నారని, అందులోభాగంగానే అక్కడి పరిస్థితులను సమీక్షించడానికి వెళ్తున్నట్లు తెలిపారు. గ్రీన్‌లాండ్ వాయువ్య తీరంలో ఉన్న స్పేస్ ఫోర్స్ అవుట్‌పోస్ట్, సైనిక స్థావరాలను సందర్శిస్తామన్నారు. ప్రపంచదేశాల భద్రతను కాపాడటం ముఖ్యమని తాము భావిస్తున్నందున ఈ పర్యటనకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కాగా డెన్మార్క్ (Denmark) అధీనంలోని గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తానని ట్రంప్ పదే పదే పేర్కొంటున్న సమయంలో వాన్స్ ఆహ్వానం లేకుండా ఆ దేశానికి వెళ్లడమే కాకుండా అమెరికా మద్దతు లేకుండా గ్రీన్‌లాండ్ మనుగడ సాగించడం కష్టమని విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.