Supreme Court: సుప్రీంకోర్టులో ట్రంప్‌నకు ఉపశమనం

అక్రమ వలసదారులకు కలిగే సంతానికి జన్మత లభించే అమెరికా పౌరసత్వం రద్దు విషయంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )నకు సుప్రీంకోర్టు (Supreme Court) నుంచి భారీ ఉపశమనం లభించింది. అధ్యక్షుడి కార్యనిర్వాహక ఉత్తర్వుల అమలును అడ్డుకుంటున్న ట్రయల్ కోర్టులు, ఏకసభ ధర్మాసనాల అధికారాలకు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం కోత విధించింది. జాతీయ స్థాయిలో ప్రభావితం చేపేలా ఆదేశాలిచ్చే అధికారం ఏకసభ్య ధర్మాసనాలకు లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మెజారిటీ సభ్యుల తీర్పుపై భిన్నాభిప్రాయం కూడా వ్యక్తమయ్యింది. రాజ్యాంగాన్ని యధేచ్ఛగా ఉల్లంఘించమని ప్రభుత్వాన్ని ఆహ్వానించినట్లుగా తీర్పు ఉందని భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన జడ్జి జస్టిస్ సొటొమేయర్ (Justice Sotomayor )అసమ్మతి నోట్‌లో పేర్కొన్నారు. తాజా తీర్పు ప్రకారం జన్మత పౌరసత్వ రద్దును సవాల్ చేసిన కేసులన్నీ దిగువ కోర్టులకు వెళ్లనున్నాయి. హైకోర్టు (High Court)ల ఆదేశాలు, సూచనల మేరకు ఈ తరహా కేసుల్లో తీర్పులు ఎలా ఇవ్వాలో నిర్ణయించడం జరుగుతుందని మెజారిటీ జడ్జీల అభిప్రాయాన్ని వెల్లడిస్తూ తీర్పు రాసిన న్యాయమూర్తి జస్టిస్ అమీ కొనే బ్యారెట్ (Amy Coney Barrett) తెలిపారు. జన్మత పౌరసత్వం రద్దు చేస్తూ గతంలో ట్రంప్ జారీచేసిన ఆదేశాల చట్టబద్ధతపై కోర్టు స్పష్టత ఇవ్వలేదు.