ఇరాన్ కు షాక్ ఇచ్చిన అగ్రరాజ్యం

ఇరాన్‍తో సంబంధం ఉన్న అమెరికా వార్త చానళ్లకు చెందిన అనేక వెబ్‍సైట్లను అగ్ర రాజ్యం సీజ్ చేసింది. ఇవన్నీ తప్పుడు సమారం అందిస్తున్నాయన్న నెపంతో వీటిని నిలిపివేసినట్లు జాతీయ భద్రతాధికారులు తెలిపారు. ఇరాన్‍తో సంబంధం ఉన్న న్యూస్ పోర్టల్ ప్రెస్‍టివి.కామ్‍ను కొంత మంది వినియోగదారులు చూడలేరని సిఎన్‍ఎన్ పేర్కొంది. దీన్ని చూడాలని ప్రయత్నిస్తే బ్యూరో ఆఫ్ ఇండిస్టీ అండ్ సెక్యూరిటీ, ఆఫీస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎన్‍ఫోర్స్మెంట్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్‍ఫోర్స్మెంట్‍లు తీసుకునే చట్టపరమైన చర్యలు భాగంగా యూఎస్‍సి 18 వారెంట్ ప్రకారం ప్రెస్‍టివి.కామ్ నిషేధంలో ఉంది అని పేర్కొంది. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. తమకు చెందిన అనేక వార్త సంస్థల వెబ్‍స్లైను బ్లాక్ చేసిందని తెలిపింది.