ఆ కూటమిలో ఇండియా, జపాన్ దేశాలకు చోటు లేదు
ఇండో పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు అమెరికా ఆకస్ కూటమిని ఏర్పాటు చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలతో ఆకస్‌ను ఏర్పాటు చేశారు. ఆ కూటమిలో బ్రిటన్ తన వద్ద ఉన్న అణ్వాయుధ జలాంతర్గాముల టెక్నాలజీని ఆస్ట్రేలియాకు ఇవ్వనున్నది. అయితే ఈ కూమిటీలో ఇండియా లేదా జపాన్ దేశాలను చేర్చేదిలేదని అమెరికా స్పష్టం చేసింది. సెప్టెంబర్ 15వ తేదీన అకస్ గ్రూపును బైడెన్ ప్రకటించారని, ఈ గ్రూపులో మరో దేశాన్ని చేర్చుకోవడం లేదని ఫ్రాన్స్‌కు బైడెన్ స్పష్టం చేశారని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి మీడియా సమావేశంలో తెలిపారు.






