అమెరికాలో పాస్ పోర్టూ రాదాయే!
సిబ్బంది కొరత వల్ల అమెరికాలో పాస్ పోర్టుల జారీ ప్రక్రియ విపరీతంగా ఆలస్యమవుతోంది. దీనిపై అమెరికా పౌరులు తమ కాంగ్రెస్ (పార్లమెంటు) సభ్యులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. అధిక రుసుములు చెల్లిస్తున్నారు. పాస్పోర్టు కార్యాలయాల ముందు బారులు కడుతున్నారు. వారి సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో అధికారులు చెప్పలేకపోతున్నారు. వారికి ఒక్క వారంలోనే 5 లక్షల పాస్పోర్టు దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి అర్థమవుతుంది. గతేడాది 2.2 కోట్ల పాస్ పోర్టులను జారీ చేశామనీ, ఈ ఏడాది అంతకుమించే జారీ చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. మరోపక్క ఢల్లీిలో అమెరికా వీసా ఇంటర్వ్యూల కోసం 145 రోజులపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది.






