Peter Hegseth :ఇరాన్‌తో యుద్ధం చేయం : పీటర్ హెగ్సెత్

ఇరాన్‌తో యుద్ధం చేయబోమని అమెరికా రక్షణశాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ (Peter Hegseth) స్పష్టం చేశారు. ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్ పేరుతో చేపట్టిన దాడులు కేవలం అణు కేంద్రాల లక్ష్యంగానే సాగాయని వెల్లడిరచారు. ఆ దేశంలో నాయకత్వాన్ని మార్చే ఉద్దేశమూ తమకు లేదని తేల్చి చెప్పారు. ఇరాన్‌ను అణు ఒప్పంద చర్చలకు అంగీకరింపజేయడానికే ఈ దాడులు చేశామని అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) తెలిపారు. 14 బంకర్ బస్టర్ బాంబులతో అణు కేంద్రాలపై దాడులు చేశామని అమెరికా ( America) త్రివిధ దళాల అధిపతి, వైమానిక దళాధిపతి అయిన డాన్ కెయిన్ వివరించారు. దాడుల సమయంలో ఇరాన్ నుంచి ఎటువంటి నిరోధం ఎదురు కాలేదు. మిస్సోరీ (Missouri)లోని వైమానిక స్థావరం నుంచి విమానాలను తరలించాం. ఈ ప్రక్రియలో ఇరాన్ (Iran) ను ఏమార్చాం అని హెగ్సెత్ తెలిపారు. కొన్ని నెలలపాటు ఈ దాడుల కోసం ప్రణాళిక వేశామని వివరించారు. ఆదివారం నాటి దాడుల్లో అనూహ్య విజయం సాధించామని తెలిపారు.