Donald Trump: డొనాల్డ్ ట్రంప్ చర్యను తప్పుపట్టిన అమెరికా కోర్టు

లాస్‌ఏంజెలెస్‌లో వలసదారులకు వ్యతిరేకంగా ఇమ్మిగ్రేషన్ (Immigration), కస్టమ్స్ (Customs) అధికారులు నిర్వహిస్తున్న దాడులకు వ్యతిరేకంగా వలసదారులు చేపట్టిన నిరసనల్ని నిలువరించేందుకు 4000 మంది నేషనల్ గార్డ్ సాయుధ దళ సభ్యుల్ని మోహరించడం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పరిధిని అతిక్రమించారని ఫెడరల్ కోర్టు జడ్జి (Federal court judge) ఒకరు పేర్కొన్నారు. ఈ దళాలను నియంత్రించే అధికారాన్ని కాలిఫోర్నియాకు తిరిగి ఇవ్వాలని న్యాయమూర్తి చార్లెస్ బ్రెయెర్ (Charles Breyer ) ఆదేశించారు. నేషనల్ గార్డ్ దళాల నియుక్తి చట్టసమ్మతం కాదని, ఈ ఆదేశాలు పదో సవరణను అధ్యక్షుని అధికార పరిమితులను మీరాయని జడ్జి అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడు తన సమ్మతి లేకుండా గార్డ్ దళాలనను లాస్‌ఏంజెలెస్‌లో నియమించారన్న కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసమ్ వ్యాజ్యం పై జడ్జి ఆదేశాలు పై మేరకు జారీ చేశారు.