Donald Trump : వీసాల రద్దు ఆపండి ..ట్రంప్ సర్కారుకు న్యాయస్థానం ఆదేశం

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం 133 మంది విద్యార్థుల (Students) కు నిలిపేసిన ఎస్‌ఈవీఐఎస్‌ను ( స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టం) న్యాయస్థానం పునరుద్ధరించింది. ఇందులో ఎక్కువ మంది భారత్ (India)కు చెందినవారే ఉన్నారు. అమెరికా విదేశాంగశాఖ వీరి వీసా(Visa) లను రద్దు చేయడంతోపాటు ఎస్‌ఈవీఐఎస్ (SEVIS)ను నిలిపేయడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విద్యార్థులు పలు సందర్భాల్లో దర్యాప్తు సంస్థల దృష్టిలో పడ్డారని అక్కడి ప్రభుత్వ ఏజెన్సీలు చెబుతున్నాయి.