Harvard University: హార్వర్డ్ పై డొనాల్డ్ ట్రంప్‌నకు కోర్టులో ఎదురుదెబ్బ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రఖ్యాత హార్వర్డ్ వర్సిటీ (Harvard University)లో విదేశీ విద్యార్థులు చేరకుండా ఆయన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఫెడరల్ కోర్టు (Federal Court) అడ్డుకొంది. ప్రభుత్వ ప్రయత్నాలను నిలిపివేస్తూ ఫెడరల్ కోర్టు జడ్జి ఎల్లిసన్ బరోస్ (Ellison Burroughs) తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయమై గత వారం ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపారు. తుది తీర్పు వెలువడే వరకు యథాతథ స్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. హార్వర్డ్ లాయర్ల వాదనలు విన్న అనంతరం ఆమె ప్రజలు భయపడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్ణ యం కారణంగా వేలాది మంది విదేశీ విద్యార్థులు అనిశ్చిత స్థితిలో చిక్కుకున్నారని వర్సిటీ న్యాయవాదులు తెలిపారు. వీరిలో 800 మంది భారతీయ విద్యార్థులు (Indian students_ కూడా ఉన్నారు. కొంతమంది ఇతర విద్యా సంస్థల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, మరికొందరు ప్రవేశాలను వాయిదా వేసుకుంటున్నారని చెప్పారు.