శుభవార్త ఆ గ్రీన్ కార్డులపై.. పరిమితి ఎత్తివేత్త!
ఉద్యోగ ఆధారిత ఇమిగ్రెంట్ వీసాల విషయంలో అమెరికా గ్రీన్ కార్డుల (పర్మనెంట్ లీగల్ రెసిడెన్సీ) జారీపై దేశాల వారీగా అమల్లో ఉన్న పరిమితిని (క్యాప్స్) ఎత్తివేస్తూ కీలకమైన బిల్లుకు హౌస్ జ్యూడీషియరీ కమిటీ ఆమోదం తెలిపింది. అలాగే కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రెంట్ వీసాల జారీలోనూ దేశాల వారీగా పరిమితిని 7 శాతం నుంచి 15 శాతం వరకు పెంచారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చి, అమల్లోకి వస్తే అమెరికాలోని భారత్, చైనా ఉద్యోగులకు భారీ లబ్ది చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఈ రెండు దేశాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు గ్రీన్‌కార్డుల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఈ బిల్లుపై హౌస్ జ్యుడీషియరీ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. బిల్లుకు అనుకూలంగా 22 కోట్లు, వ్యతిరేకంగా 14 కోట్లు వచ్చాయి. అనంతరం యూఎస్ సెనేట్ సైతం ఆమోదించాల్సి ఉంటుంది. తర్వాత అధ్యక్షుడు జో బైడెన్ సంతకం ఏస్తే చట్టంగా మారుతుంది.






