Lahore: అమెరికా హెచ్చరిక.. తక్షణమే లాహోర్‌ను వీడండి!

లాహోర్ (Lahore ) లో పాక్ మోహరించిన హెచ్‌క్యూ 9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ రాడార్లను భారత్ ధ్వంసం చేయడంతో, అమెరికా (America) ఒక్కసారిగా అప్రమత్తమైంది. తమ దేశ పౌరులు ఎవరైనా ఉంటే, తక్షణమే లాహోర్‌ను విడిచి వెళ్లిపోవాలని అడ్వైజరీ (Advisory) జారీ చేసింది. ఈ మేరకు పాక్‌లోని అమెరికా దౌత్యకార్యాలయం (US Embassy) ప్రకటన విడుదల చేసింది. నగరంలో పేలుళ్లు, డ్రోన్ల కూల్చివేతలు చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని పేర్కొంది. తమ సిబ్బందిని షెల్టర్‌లోకి తరలించినట్లు వెల్లడిరచింది.