కాబూల్ కు వెళ్లిన అమెరికా ఎంపీలు
అమెరికాకు చెందిన ఇద్దరు చట్టసభ్యులు కాబూల్ విమానాశ్రయాన్ని సందర్శించారు. ముందస్తు సమచారం ఇవ్వకుండా వీరిద్దరూ కాబూల్ కు వెళ్లడంపై అమెరికా విదేశాంగ శాఖ, సైన్యం అగ్రహం వ్యక్తం చేశాయి. సెథ్ మౌల్టన్ (డెమోక్రాట్), పీటర్ మీయర్ (రిపబ్లికన్)లు ప్రతినిధుల సభకు ప్రాతినిధ్య వహిస్తున్నారు. వీరిద్దరూ ప్రత్యేక విమానంలో ఆకస్మికంగా కాబూల్ విమానాశ్రయానికి వెళ్లారు. విదేశీ పౌరులు, శరణార్థులను తరలిస్తున్న చర్యలను పరిశీలించారు. కొన్ని గంటల పాటు అక్కడ గడిపారు. వీరిద్దరూ గతంలో సైన్యంలో పనిచేశారు. ప్రస్తుతం సాయుధ సేనల కమిటీలో మౌల్టన్, విదేశీ వ్యవహారాల కమిటీలో మీయర్ సభ్యులుగా ఉన్నారు. వీరి ప్రత్యేక విమానం కాబూల్ లోకి ప్రవేశించడానికి కొన్ని క్షణాల ముందే తమకు వారి పర్యటన గురించి సమాచారం అందిందని సైన్యం పేర్కొంది. ఈ పర్యటన వల్ల ఇతరుల తరలింపునకు ఇబ్బందులు తలెత్తాయని అన్నారు.






