నెవడా, వర్జిన్ ఐలాండ్స్ లో ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న పోరులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో రెండు విజయాలను నమోదు చేశారు. నెవడా కాకసస్ నుంచి ఐరాస మాజీ రాయబారి నిక్కీ హెలీ వైదొలగగా ట్రంప్ ఒక్కరే ప్రధాన పోటీదారుగా నిలిచి గెలుపొందారు. ఇదే రాష్ట్రంలో నిర్వహించిన ప్రైమరీలో నోటా కన్నా నిక్కీ హెలీకి తక్కువ ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. యు.ఎస్.వర్జీనియా ఐలాండ్స్‌లో నిర్వహించిన కాకసస్లో ట్రంప్ 73.98 శాతం ఓట్లతో విజేతగా నిలిచారు. నిక్కీ హెలీకి 26.02 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.






