Donald Trump : త్వరలోనే పుతిన్‌తో ముఖాముఖి భేటీ : ట్రంప్ వెల్లడి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్యవర్తిత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తుర్కియే (Turkey) వేదికగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి. అయితే వీటికి పుతిన్ గైర్హాజరయ్యారు. దీనిపై తాజాగా ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాను పుతిన్ (Putin) తో ముఖాముఖి భేటీ కానున్నట్లు తెలిపారు. పశ్చిమాసియా పర్యటన (West Asia tour ) ముగించుకుని ట్రంప్ అమెరికా తిరుగుపయనమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) శాంతి చర్చల అంశాన్ని ప్రస్తావించారు. ఈ చర్చలకు పుతిన్ హాజరుకాకపోవడం నన్నేమీ ఆశ్చర్యపర్చలేదు. ఎందుకంటే నేను లేకుండా ఆయన అక్కడకు వెళ్లరు. బహుళా మేమిద్దరం కలుసుకునే సమయం వచ్చినట్లు ఉంది. లీనైనంత త్వరలోనే పుతిన్‌తో నేను ముఖాముఖిగా సమావేశమవుతా అని ట్రంప్ వెల్లడిరచారు. తన కుమార్తె టిఫనీ బిడ్డకు జన్మనిచ్చిందని, అందుకే తాను వెంటనే అమెరికా వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.